మల్లు రవిని కలిసి నోటీసులకు వివరణ | - | Sakshi
Sakshi News home page

మల్లు రవిని కలిసి నోటీసులకు వివరణ

Sep 18 2026 1:57 AM | Updated on Sep 18 2026 1:57 AM

దండేపల్లి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దండేపల్లి మండలం గూడెం పర్యటనను అడ్డుకున్న ఆర్‌జీపీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, పార్టీ మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యాల శ్రీనివాస్‌, ఆర్టీఏ సభ్యుడు అంకతి శ్రీనివాస్‌, నాయకులు ఆకుల దుర్గప్రసాద్‌, లక్కాకుల సృజన్‌ పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయగా గురువారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు వెళ్లారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మల్లు రవిని కలిసి నోటీసులకు వివరణ ఇచ్చారు. పార్టీలో విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement