బెల్లంపల్లి: బెల్లంపల్లి శివారులోని మామిడి తోటలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై గురువారం పోలీసులు దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. తాళ్లగురిజాల ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్‌పీ గార్డెన్‌లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి 9మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జె.క్రాంతి కుమార్, డి.శ్రీనివాస్, ఎ.పోశం, తొంగల వెంకటేశ్, గొడిశాల మణిరాజ్, గాజు గంగాధర్, సింగతి రవి, సలేందర్ కేశవ్, ఎండీ హఫీజ్‌లను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.1,28,240 నగదు, 8సెల్‌ఫోన్లు, 104 పేక ముక్కలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


