‘సింగరేణిలో ప్రతీ విభాగం కీలకమే’ | - | Sakshi
Sakshi News home page

‘సింగరేణిలో ప్రతీ విభాగం కీలకమే’

May 29 2026 2:37 AM | Updated on May 29 2026 2:37 AM

మందమర్రిరూరల్‌: సింగరేణిలో ప్రతీ విభాగం కీలకమేనని, అన్ని విభాగాల్లోని సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఏరియా జీఎం రాధాకృష్ణ పేర్కొన్నారు. జీఎం ఆఫీస్‌ ఆవరణలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం వివిధ విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సిబ్బంది పరస్పరం బాధ్యతాయుతంగా వ్యవహరించి విధులు నిర్వహించినప్పుడే, సంస్థ ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల అధికారుల పనుల వివరాలు తెలుసుకొని సూచనలు చేశారు. సమావేశంలో ఏజీఎం (ఎఫ్‌అండ్‌ఏ) ఆర్వీఎస్‌ఆర్కే ప్రసాద్‌, డీజీఎం(పర్సనల్‌) అశోక్‌, ఐఈడీ కిరణ్‌కుమార్‌, సివిల్‌ ఎస్‌ఈ శ్రీధర్‌, సీనియర్‌ పీవో సత్యనారాయణ, ఏరియాలోని అన్ని గనులు సంక్షేమాధికారులు, అకౌంట్‌ విభాగం అధికారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement