ఆదిలాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆదిలాబాద్ జిల్లా వాసి, వనవాసీ కల్యాణ పరిషత్ అఖిల భారతీయ జాతీయ ఉపాధ్యక్షుడు కుమ్ర నాగు కలిశారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పరిషత్ అధ్యక్షుడు సత్యేంద్ర జీతో కలిసి డీ లిస్టింగ్ అంశంపై వినతిపత్రం అందించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను పాటించకుండా ఇతర మ తంలోకి వెళ్లిన వారి రిజర్వేషన్లు తొలగించా లని విన్నవించారు. వారిని డీ లిస్టింగ్‌లో చేర్చాలన్నారు. కార్యక్రమంలో పరిషత్ ప్రతినిధులు రాజకిషోర్ హస్దా, సూరి తదితరులు ఉన్నారు.
ఒకే కాన్పులో ముగ్గురు జననం
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రై వేటు ఆసుపత్రిలో గురువారం ఓ గర్భిణి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇ ద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి కాగా, ము గ్గురూ ఆరోగ్యంగా ఉన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన రిషిక(25) 34 వారాల సమయంలో తీవ్రమైన కడుపునొప్పి రక్తస్రావంతో ఆస్పత్రి లో చేరింది. వైద్యులు శశికాంత్, శైలజ పరీక్షించి ఆమెకు శస్త్రచికిత్స చేయగా ముగ్గురు పిల్లలు జన్మించారు. 8000 మందిలో ఇలా ఒకరు మాత్రమే ముగ్గురికి జన్మనిస్తారని తెలిపారు.
రెండు కార్లు ఢీ
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై సాయి మందిర్ సమీపంలోని యూ టర్న్ వద్ద గురువారం రెండు కార్లు ఢీకొన్నాయి. బస్టాండ్ వైపు నుంచి చెక్‌పోస్టు వైపు వెళ్తున్న కారు, గుండి చౌరస్తా వద్ద రాంగ్‌రూట్‌లో యూ టర్న్ తీసుకుంటున్న మరో కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
ఇరువురికి స్వల్ప గాయాలు
లక్ష్మణచాంద: కనకాపూర్ జాతీయ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. మామడ మండలంలోని రాయదారి గ్రామానికి చెందిన రాజు, లక్ష్మణచాందలో ఆర్‌ఎంపీగా విధులు నిర్వహిస్తున్న మరో వ్యక్తికి చెందిన కార్లు బుధవారం రాత్రి 11 గంటల సమయంలో కనకాపూర్ జాతీయ రహదారిపై ఢీకొన్నాయి. కార్లు ధ్వంసం కాగా ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి.


