ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి

May 29 2026 2:37 AM | Updated on May 29 2026 2:37 AM

● ఐటీడీఏ పీవో మకరందు

ఉట్నూర్‌రూరల్‌: ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రతి ఒక్కరూ పాటించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. గురువారం ప్రపంచ ఆకలి నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని కేబీ కాంప్లెక్స్‌ మైదానంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. చిన్నారులకు పోషక విలువలు కలిగిన మహోవా లడ్డూలు, అల్పాహారం పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు. రోజుకు కనీసం 400 గ్రాముల మేర ఆకుకూరలు, పండ్లు, పోషకాహారం తీసుకోవాలని, తిండి, నిద్ర, వ్యాయామం, క్రీడలు ప్రతి మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలన్నారు. కార్యక్రమానికి మందు ఐటీడీఏ కార్యాలయ సిబ్బందితో కలిసి ఫ్రెండ్లీ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఆయన కార్యాలయం నుంచి సైకిల్‌పై వచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement