సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రత్యేక తెలంగాణ ఏర్పడి దశాబ్దం గడిచినా అభివృద్ధి జరగలేదని టీఆ ర్‌ఎస్(తెలంగాణ రక్షణ సేన) పార్టీ నేతలు విమర్శించారు. ఉచిత విద్య, వైద్యం, యువతకు ఉద్యో గ, ఉపాధి, రైతులకు అండగా, సామాజిక న్యాయంతో పాంచజన్యం సాధన లక్ష్యంగా తమ పార్టీ ముందుకు వెళ్తోందని అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి బోడ జనార్ధన్ నివాసంలో రాష్ట్ర నాయకురాలు డాక్టర్ మంచాల వరలక్ష్మి, జిల్లా నాయకులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి బోడ జనార్ధన్ తమ పార్టీలోకి రావడం సంతోషమని అన్నారు. వచ్చే నెల 15నుంచి పార్టీ అధ్యక్షురాలు ‘బాయిబాట’తో సింగరేణి ప్రాంత సమస్యల సాధన కోసం జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. పార్టీ జెండా పండుగకు ఇన్చార్జీలను నియమించినట్లు తెలిపారు. మాజీ మంత్రి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశానని, 28న ఎన్టీఆర్ జయంతిన పార్టీలో చేరుతానని తెలిపారు. అధికార పార్టీ యువతకు ఉద్యోగ కల్పన, ధాన్యం సేకరణలో విఫలమైందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనూ నీళ్లు, నిధులు, నియామకాలు రాలేదన్నారు. నాయకులు ఐద ప్రశాంత్, లెనిన్, రఘు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


