విద్యార్థులకు చదువుతో పాటు అనుభవం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపునకు సైన్స్ సమ్మర్ క్యాంపు దోహదపడుతుంది. కొత్త ఆలోచనలు, సృజనాత్మకత అభివృద్ధి చెందటంతో పాటు విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి పెరుగుతుంది. టీమ్‌వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడుతాయి. రోబోటిక్స్, కోడింగ్, సైన్స్ మోడల్స్ ఆధునిక అంశాలపై అవగాహన పెరుగుతుంది. ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా విద్యార్థుల్లో నమ్మకం పెరుగుతుంది. పుస్తకాలలో మాత్రమే కాకుండా ప్రయోగాల ద్వారా సైన్స్ నేర్చుకునేందుకు జిల్లా సైన్స్ సెంటర్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో గతనెల 27న ప్రారంభమైన సమ్మర్‌క్యాంపు 15 రోజుల పాటు కొనసాగుతుంది. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ తొమ్మిది రోజుల పాటు కొనసాగుతున్న సైన్స్ సమ్మర్ క్యాంపుపై విద్యార్థుల
అభిప్రాయాలు.. – మంచిర్యాలఅర్బన్
కొత్త ప్రయోగాలు నేర్చుకుంటున్నాం
సైన్స్ సమ్మర్‌క్యాంపులో కొత్త ప్రయోగాలు నేర్చుకుంటున్నాం. గెలాక్సీ, యూనివర్స్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సెన్స్ ఎకై ్స్ప రిమెంట్ బాగున్నాయి. లోయర్ క్లాస్‌లో ఉన్నప్పటికీ హయ్యర్ క్లాస్ కాన్సెప్ట్ అర్థమవుతున్నందుకు సంతోషంగా ఉంది.
– నక్షత్ర, జెడ్పీహెచ్‌ఎస్, మంచిర్యాల
సైన్స్‌పై భయం తొలగింది..
ప్రయోగాలు మాతో చేయించటం వల్ల సైన్స్‌పై ఉన్న భయం తొలగింది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, అన్నిరకాలు ప్రయోగాత్మకంగా నేర్పించడంతో కార్యకలాపాల్లో నిమగ్నమవుతున్నాం, హోం వర్క్‌గా కొన్ని యాక్టివిటీస్‌ని ఇచ్చి మరుసటి రోజు మాతో ప్రదర్శింప జేయడంతో సులభంగా నేర్చుకుంటున్నాం.– బి.కృతి, టీఎస్‌ఎంఎస్, మంచిర్యాల
ఆరోగ్యంపై అవగాహన
బయాలజీలో భాగంగా ఊపిరితిత్తుల పని విధానం, గుండె, కిడ్నీ, హార్ట్‌స్ట్రోక్ ఎలా వస్తుంది?.. కార్డియా అరెస్టే అంటే ఏమిటి?.. స్టంట్ ఎలా వేస్తారనే విషయాలు తెలుసుకున్నాం. మెరుగైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యంపై అవగాహన పెంచుకునేందుకు సైన్స్ సమ్మర్‌క్యాంపు ఉపయోగపడింది. – పి.శ్రేయాంత్, మంచిర్యాల
ప్రయోగాత్మకతతో ఆసక్తి..
సైన్స్ సమ్మర్ క్యాంపులో ప్రయోగాత్మకంగా చేయించడం వల్ల సులభంగా అర్థమయ్యాయి. ప్రాక్టికల్‌గా నేర్పటం వల్ల మరింత ఆసక్తి పెరుగుతోంది. ప్రయోగాత్మక బోధన చాలా నచ్చింది. మిర్రర్స్ ప్రాపర్టీస్, లైట్ కాన్సెప్ట్, మైక్రోసాఫ్ట్ గు రించి తెలుసుకోవడం కొత్త అనుభూతి ఇస్తోంది.
– ఎం.నిక్షిత్, మంచిర్యాల
ప్రత్యక్ష ప్రయోగాలు..
విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెంచడం సైన్స్ సమ్మ ర్ క్యాంపు ఉద్దేశం. ప్రయోగాలు, సైన్స్ గేమ్స్, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం. ఆకర్షితులు అయ్యేందుకు రోజూ ఫన్ మాక్టివిటీస్ చేయిస్తున్నాం. సైన్స్ సూత్రాలు, నిజజీవితంలో ఉన్న సైన్స్ సూత్రాలు, క్లాస్ రూమ్‌లో బోధన మూడింటి సమన్వయంతో నిర్వహిస్తున్నాం.
– డి.రాజగోపాల్, డీఎస్‌వో, మంచిర్యాల


