కాసిపేట: చేపల వే టకు వెళ్లి బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపిన వివరాల మేరకు తిర్యాణి మండలం చిన్న అ రటిపల్లి గ్రామానికి చెందిన మడావి సురేష్ (16) వారం రోజుల క్రితం వెంకటాపూర్‌లో ఉంటున్న తన మేనత్త ఆత్రం గోదుబాయి ఇంటికి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం తన మి త్రులతో కలిసి అటవీ ప్రాంతానికి చేపల వేటకు వెళ్లాడు. అటవీ శాఖ అధికారులు జంతువుల కోసం ఏర్పాటు చేసిన కుంటలో దిగడంతో ఈతరాక నీటిలో మునిగిపోయాడు. తోటి మిత్రుల సమాచారంతో స్థానికులు వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని తండ్రి బొజ్జిరావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


