జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌లో విద్యార్థినుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌లో విద్యార్థినుల ప్రతిభ

May 4 2026 10:43 AM | Updated on May 4 2026 10:43 AM

వేమనపల్లి: జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆ ధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన అథ్లెటిక్స్‌ పోటీల్లో వేమనపల్లి, నీల్వాయి విద్యార్థినులు ప్రతిభ క నబరిచారు. అండర్‌–18 విభాగంలో కుర్రు శ్రీ వాణి లాంగ్‌ జంప్‌, షాట్‌పుట్‌లో ప్రథమ, జెడగల్ల అంజలి హైజంప్‌లో ప్రథమ, అండర్‌–16 లో చింతల మహేశ్వరి లాంగ్‌ జంప్‌లో ప్రథ మ, బండి నందిని హైజంప్‌లో ప్రథమ, అండర్‌–14లో గురుండ్ల శ్రేయ ట్రై అత్లీన్‌లో ద్వితీ య స్థానాలు సాధించారు. వీరు త్వరలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటార ని పీఈటీ మల్లేశ్‌ తెలిపారు. వీరిని ప్రజాప్రతినిధులు, మండల అధికారులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement