అకాల వర్షం.. ఆగమాగం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. ఆగమాగం

May 4 2026 10:37 AM | Updated on May 4 2026 10:37 AM

జిల్లాలో పలుచోట్ల కురిసిన వాన

కోత దశలో నేలకొరిగిన వరి పొలం

షార్ట్‌ సర్క్యూట్‌తో పంటలు దగ్ధం

కల్లాల్లో తడిసిన ధాన్యం కుప్పలు

రోడ్లకు అడ్డంగా విరిగిపడ్డ చెట్లు

జైపూర్‌/కోటపల్లి/చెన్నూర్‌రూరల్‌/వేమనపల్లి/భీమారం/రామకృష్ణాపూర్‌/మందమర్రిరూరల్‌: జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షం రైతులను ఆగమాగం చేసింది. జైపూర్‌ మండలంలో శనివారం అర్ధరాత్రి ఈదురుగాలులు వీచా యి. ఈ కారణంగా విద్యుత్‌ తీగలు తెగి షార్ట్‌ స ర్క్యూట్‌తో కాన్కూర్‌ గ్రామానికి చెందిన రైతు గుర్ణ దుర్గయ్యకు చెందిన కోతకు వచ్చిన వరి పొలం కా లిపోయింది. కళ్లెదుటే తన రెక్కల కష్టం అగ్నికి ఆ హూతి కావడంతో దుర్గయ్య కన్నీటిపర్యంతమయ్యాడు. సుమారు రూ.లక్ష వరకు నష్టం జరిగి నట్లు తెలిపాడు. కోటపల్లి మండలంలో ఆదివారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసింది. మండలకేంద్రంలో ధాన్యంపై టార్పాలిన్లు కప్పినా తడిసి ముద్దయింది. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. రాపనపల్లి గ్రామంలో పిడుగుపడి తాటిచెట్టు కాలిపోయింది. ఈదురుగాలులతో కురిసిన చిరుజల్లులకు చెన్నూర్‌ మండలంలోని అంగ్రాజ్‌పల్లి గ్రామంలో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్‌ తీగలపై పడ్డాయి. దీంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయమేర్పడింది. స్ధానిక సర్పంచ్‌ పాగె రాజమణి తక్షణమే స్పందించి చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపట్టి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. భీమారం మండలంలోని బూర్గుపల్లిలో ఆదివారం వీచిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి వరి పైరు నేల వాలింది. భీమారం మండ ల కేంద్రంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసింది. ధాన్యం తడవకుండా కుప్పలపై రైతులు టార్పాలిన్లు కప్పారు. ఆదివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు వేమనపల్లి మండలంలో పలుచో ట్ల చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్‌ తీగలపై పడ్డాయి. దస్నాపూర్‌ సమీపంలోని దుర్గం రా జయ్య పొలంలో 11కేవీ విద్యుత్‌ స్తంభం కూలింది. దీంతోలో మండల కేంద్రానికి 2గంటల పాటు వి ద్యుత్‌ సరఫరా నిలిచింది. మండల కేంద్రంలోని ప్రాణహిత కాలనీలో విద్యుత్‌ తీగలు తెగి చెట్లపై పడ్డాయి. ట్రాన్స్‌కో, జేఎల్‌ఎం ఉదయకుమార్‌, సి బ్బంది మహేశ్‌ విద్యుత్‌ లైన్‌లను సరిచేసి సరఫరా ను పునరుద్ధరించారు. నీల్వాయిలో ఈదురుగాలు లతో మోస్తరు వర్షం కురిసింది. రైతులు మొక్కజొ న్న, వరి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు పడ్డారు. రామకృష్ణాపూర్‌లో ఆదివారం మధ్యాహ్నం ఈదురుగాలు లతో కూడిన వర్షం పడి ‘ఏ’ జోన్‌, ‘బీ’ జో న్‌ ప్రాంతాల్లో పలు చోట్ల చెట్లు నేలకూలాయి. స్తంభాలు కూడా విరిగిపోగా విద్యుత్‌ సరఫరా నిలిచింది. సూ పర్‌బజార్‌ సెంటర్‌లో ఓ వృక్షం నడిరోడ్డు పై విరిగి పడడంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. మున్సిపల్‌ సిబ్బంది వెంటనే చెట్లను తొలగించారు. గాలివాన బీభత్సానికి చెట్టు విరిగి మందమర్రి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంపై పడింది. విద్యుత్‌ తీగలపై కూడా చెట్టు కొమ్మలు పడగా స్తంభాలు విరిగిపోయాయి. స్తంభం విరిగిపడి సింగరేణి ఫారెస్ట్‌ అధికారి ఇంటి ఎదుట నిలిపి ఉన్న కారుపై పడగా ధ్వంసమైంది. కోల్‌బెల్ట్‌ రోడ్డుపై చెట్లు కూలిపోవడంతో పోలీస్‌ సిబ్బంది తొలగించారు. సారంగపల్లి, సండ్రోన్‌పల్లి కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. పలు గ్రామాల్లో మామిడి చెట్ల నుంచి కాయలు రాలిపోయాయి. కోతకొచ్చిన వరి పంటకు నష్టం జరిగింది. పట్టణంలో 10గంటల వరకు కూడా కరెంట్‌ రాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement