పేదల అభ్యున్నతి కోసమే పథకాలు | - | Sakshi
Sakshi News home page

పేదల అభ్యున్నతి కోసమే పథకాలు

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

బెల్లంపల్లి: పేదల అభ్యున్నతి కోసమే ప్రభుత్వం పథకాలు ప్రవేశ పెడుతోందని బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌ అన్నారు. శనివారం కన్నా ల శివారులోని ఓ ప్రైవేట్‌ గార్డెన్‌లో నియోజకవర్గ స్థాయి గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందేలా కృషి చేస్తున్నామన్నా రు. అంతకు ముందు ప్రభుత్వ శాఖల అధికా రులు అభివృద్ధి నివేదికను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జె.సంప త్‌, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement