పకడ్బందీగా ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను పకడ్బందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావు, మేయర్‌ ధర్ని మధుకర్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 5 వేల టన్నుల ధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రానివారు అధికారుల దృష్టికి తీసుకొస్తే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ రూ.300 కోట్ల అంచనా వ్యయంతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేసి మెరుగైన వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. మంచిర్యాల డిప్యూటీ మేయర్‌ సల్లా రమ్య, లక్సెట్టిపేట చైర్‌ పర్సన్‌ దొంత అంజలి, వైస్‌ చైర్‌పర్సన్‌ రాజేశ్వరి పాల్గొన్నారు.

నకిలీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు

నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకో వాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సమీకృత కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలుపు మందులు, నకిలీ, నిషేధిత విత్తనాల నియంత్రణపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీపీ అంబర్‌ కిషోర్‌ ఝూ, డీఏవో సురేఖ, పోలీస్‌, రెవెన్యూ అధికారులతో కలి సి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలు వినియోగించేలా అ వగాహన కల్పించాలన్నారు. నకిలీ విత్తనాల ని యంత్రణపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ నకిలీ, నిషేధిత విత్తనాల విక్రయం, విని యోగం నియంత్రణపై సంబంధిత శాఖల అధికా రులు సమష్టిగా కృషి చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement