ప్రథమస్థానంలో లక్సెట్టిపేట | - | Sakshi
Sakshi News home page

ప్రథమస్థానంలో లక్సెట్టిపేట

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

లక్సెట్టిపేట: ఎర్లీబర్డ్‌ స్కీంలో స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఉమ్మడి జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచింది. 2026–27 ఆర్థికసంవత్సరం ప్రారంభ నెలలో 5 శాతం రిబేటుతో పన్నుల వసూలులో జిల్లాలోనే ముందుంది. రాష్ట్రంలో 19వ స్థానం జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచింది. రూ.2.50 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్‌ ఉండగా రూ.54 లక్షలతో 26 శాతం వసూలైనట్లు మున్సిపల్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు.

చెన్నూర్‌: చెన్నూర్‌ మున్సిపాలిటీలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆస్తి పన్ను డిమాండ్‌ రూ.3.32 కోట్లు ఉండగా ఎర్లీబర్డ్‌ స్కీం ద్వారా రూ.41.42 లక్షలు వసూలైందని కమిషనర్‌ మురళీకృష్ణ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో 7,053 నివాసాలు ఉండగా 830 నివాసాలకు సంబంధించిన వసూళ్లు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.

చెన్నూర్‌ మున్సిపల్‌ కార్యాలయం

Advertisement
 
Advertisement
Advertisement