మంచిర్యాలరూరల్(హాజీపూర్): 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన నిధుల వినియోగంపై శనివారం ఐడీఓసీలోని డీపీవో ఛాంబర్‌లో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, డీఎల్‌పీవో, ఎంపీవోలతో కలిసి సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, తాగునీటి సరఫరా, ఇంటి పన్నుల వసూళ్లు, లైసెన్స్‌ల రెన్యూవల్‌పై సమీక్షించా రు. సమావేశంలో డీఎల్‌పీవోలు సతీశ్, ధర్మారాణి, ఎంపీవోలు శ్రీపతి బాపు, అజ్మత్‌అలీ, అక్తర్ మోహీనుద్దీన్, శ్రీనివాస్, సతీశ్‌రెడ్డి, వెంకటేశ్, మహేశ్, రమ్యశ్రీ, సుమన్, డీపీఎం నరేందర్, సీనియర్ అసిస్టెంట్ రాంకుమార్, తదితరులు పాల్గొన్నారు.


