తెలంగాణ సాధించిన ఘనత బీఆర్‌ఎస్‌దే.. | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ సాధించిన ఘనత బీఆర్‌ఎస్‌దే..

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

● మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ● ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

నస్పూర్‌: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. సోమవారం బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నస్పూర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో, తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ స్వరాష్ట్రం సాధ్యమైందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిందని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడిందని, ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని, మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి కే.సురేందర్‌రెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement