గోల్డ్‌ లోన్‌ బాధితుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ లోన్‌ బాధితుల ఆందోళన

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

చెన్నూర్‌: చెన్నూర్‌ ఎస్‌బీఐ బ్రాంచిలో గోల్డ్‌ లోన్‌ బాధితులు సోమవారం ఆందోళన చేపట్టారు. గత ఏడాది బ్యాంకులో చోరీ అయిన బంగారు ఆభరణాలు లభించినా నేటి వరకు బాధితులకు ఇవ్వకపోవడం దారుణమని వా పోయారు. బ్యాంకును సందర్శించిన డీజీఎం విజయ్‌ కుమార్‌ సాహు బాధితులతో మాట్లాడారు. బంగారం కోర్టు పరిధిలో ఉందని, రు ణం పొందే సమయంలో బంగారం ధర ఎంత ఉందో ఆ ధర చెల్లిస్తామని తెలిపారు. బాధితులు ముందుకు వస్తే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. బాధితులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం డీజీఎంకు అందజేశారు. ఏజీఎం రితేష్‌ గుప్తా, మేనేజర్‌ రాజేష్‌, బ్యాంకు అధికారులు, గోల్డ్‌ లోన్‌ బాధితులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement