మండే సూర్యుడు | - | Sakshi
Sakshi News home page

మండే సూర్యుడు

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

● రెడ్‌ జోన్‌లోకి జిల్లా ● 45.8 డిగ్రీలకు గరిష్ట ఉష్ణోగ్రతలు ● దడపుట్టిస్త్ను వడగాలులు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో భానుడు భగ భగ మండుతూ నిప్పులు చెరుగుతున్నాడు. రికార్డు స్థా యి గరిష్ట ఉష్ణోగ్రతలతో దడ పుట్టిస్తున్నాడు. వడగాలుల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 33.1 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 45.8 డిగ్రీలుగా నమోదైంది. జిల్లాలో 18మండలాలకు గాను నాలుగు మండలాల్లో 45 నుంచి 46 డిగ్రీలు, 14మండలాల్లో 42 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జిల్లా మొత్తం రెడ్‌, ఆరెంజ్‌ జోన్‌లోకి వెళ్లింది. అత్యధికంగా భీమారం మండల కేంద్రంలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతన్నాయి. ఉదయం తొమ్మి ది గంటల నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రతతో జనం బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం ఎండకు తోడు అర్ధరాత్రి వరకు వడగాలులు, ఉక్కపోతతో పిల్లలు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటి నీటి ఎద్దడి తలెత్తుతోంది. ఎండలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు వేడి, ఓవర్‌లోడ్‌తో ట్రిప్‌ అవుతూ కాలిపోతున్నాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

ఓసీపీల్లో నిప్పుల కుంపటి

మండుటెండల్లో భూ ఉపరితలాల్లో పని చేసే సింగరేణి కార్మికుల పరిస్థితి నెత్తిమీద నిప్పుల కుంపటి మాదిరిగా తయారైంది. ఎండల్లో విధులు నిర్వర్తిస్తూ కొందరు వడదెబ్బ బారినపడి ఆస్పత్రి పాలవుతున్నారు. అనారోగ్యానికి గురవడంతో మధ్యాహ్నం రెండో షిఫ్టుకు వెళ్లే కార్మికుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది.

బోసిపోతున్న చిరువ్యాపారాలు

గత పది రోజులుగా మండుతున్న ఎండల్లో చిరువ్యాపారాలు, ఆటోవాలల గిరాకీలు తగ్గాయి. రోజువారీగా కూరగాయలు, పండ్లు, ఇతర చిరు వ్యాపారులు రావడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా గిరాకీలు దెబ్బతిన్నాయని అంటున్నారు. సాధారణ ప్రయాణాలు వాయిదాలు వేసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితులతోపాటు శుభకార్యల సీజన్‌ కావడంతో వాటికి హాజరయ్యేందుకు ప్రయాణాలు చేయడం పెద్ద సమస్యగా మారింది. మధ్యాహ్నం వేళ ఇళ్లలో కూలర్లు వినియోగిస్తున్నా వేడి తగ్గడం లేదు. ఎండ తీవ్రత నుంచి ఉమశమనం కోసం ప్రజలు శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు, చల్లని పండ్ల రసాల తాగేందుకు ఇష్టపడుతుండడంతో వీటి విక్రయాలు పెరిగాయి.

భీమారం నస్పూర్‌ కన్నెపల్లి దండేపల్లి లక్సెట్టిపేట జైపూర్‌ మంచిర్యాల భీమిని జన్నారం చెన్నూర్‌ హాజీపూర్‌ నెన్నెల వేమనపల్లి మందమర్రి కోటపల్లి తాండూర్‌ బెల్లంపల్లి కాసిపేట

కనిష్టం 33.6 32.2 32.8 32.3 33.6 32.4 32.8 33.8 33.9 32.4 34.0 31.8 29.8 33.6 31.8 32.9 32.2 32.3

గరిష్టం 45.8 45.4 45.3 45.2 44.8 44.6 44.5 44.4 44.4 44.3 44.2 44.2 44.0 43.8 43.8 43.3 43.3 43.1

నిర్మానుష్యంగా..

చున్నీ కప్పుకుని వెళ్తున్న యువతులు

మంచిర్యాలలో కూరగాయలు విక్రయిస్తున్న మహిళలు

Advertisement
 
Advertisement
Advertisement