ఇందిరమ్మ నిర్మాణాలు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ నిర్మాణాలు వేగవంతం చేయాలి

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

● ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రుల సమీక్ష

ఆదిలాబాద్‌టౌన్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్‌ వెంకటస్వామిలు అధికారులను ఆదేశించారు. హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్‌ కా ర్పొరేషన్‌ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో మంత్రులు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల ఆత్మగౌరవానికి ప్రతీ క అని అన్నారు. నిర్మాణ ప్రక్రియలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. లబ్ధిదారుల దరఖాస్తులను పెండింగ్‌ పెట్టవద్దని, అధికారుల వద్ద ఫైల్‌ వారం రోజులకు మించి ఉండవద్దని పేర్కొన్నారు. సిబ్బంది కొరత ఉంటే తక్షణమే అధికారులను డిప్యూటేషన్‌పై తీసుకొని పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రతీ దశలో పనుల ను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. స్థోమతలేని నిరుపేద లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాలు, బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. దశ ల వారీగా హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి మంజూ రయ్యే నిధుల ద్వారా రుణం తీర్చేలా చూడాలని తెలిపారు. సమావేశంలో ఎంపీలు నగేశ్‌, గడ్డం వంశీ, ఎమ్మెల్సీలు దండే విఠల్‌, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వినోద్‌, రామారావు పటే ల్‌, పాయల్‌ శంకర్‌, వెడ్మ బొజ్జు, పాల్వాయి హరీష్‌బాబు, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ లోకేష్‌ కుమార్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వీసీ గౌతమ్‌, ఆదిలాబాద్‌, కుమురంభీం, నిర్మల్‌, మంచిర్యాల కలెక్టర్లు రాజర్షిషా, హరిత, భవేష్‌ మిశ్రా, కుమార్‌ దీపక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement