విజ్ఞానం, వినోదానికి సైన్స్‌ ప్రయోగాలు | - | Sakshi
Sakshi News home page

విజ్ఞానం, వినోదానికి సైన్స్‌ ప్రయోగాలు

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

● జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య ● వేసవి శిబిరం ప్రారంభం

మంచిర్యాలఅర్బన్‌: వేసవి సెలవుల్లో విజ్ఞానం, వినోదం, సైన్స్‌ ప్రయోగాలకు సమ్మర్‌ సైన్స్‌ క్యాంపు ఎంతో దోహదం చేస్తుందని డీఈవో యాదయ్య అన్నారు. సోమవారం జిల్లా సైన్స్‌ కేంద్రంలో 15 రోజుల వేసవి సైన్స్‌ సమ్మర్‌ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచడం, సైన్స్‌పై ఆసక్తి పెంచేందుకు శిబిరం తోడ్పడుతుంద ని అన్నారు. 92 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. కృత్యాధార పద్ధతిలో ప్రయోగాలను తమకు తామే చేస్తూ సైన్స్‌పై అవగా హన పొందాలని తెలిపారు. జిల్లా పరీక్షల విభాగం సహాయ సంచాలకుడు మల్లేశం మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి మూఢనమ్మకాలపై సరైన అవగాహన పెంచుకోవాలని, సైన్స్‌ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. మొదటిరోజు సైన్స్‌ ఉపాధ్యాయుడు జాకీర్‌ కొన్ని ప్రయోగాలతో విద్యార్థులను ఆలోచింపజేశారు. జిల్లా పరీక్షల విభాగం కార్యదర్శి మహేశ్వర్‌రెడ్డి, సెక్టోరి యల్‌ అధికారులు భరత్‌కుమార్‌, విజయలక్ష్మి, సత్తయ్య, చౌదరి, జూనియర్‌ కళాశాల లెక్చరర్‌ నాగవర్మ, ఉపాధ్యాయులు తిరుపతి, రాజేశం, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement