బడి ముగిసింది.. బాధ్యత మిగిలింది..! | - | Sakshi
Sakshi News home page

బడి ముగిసింది.. బాధ్యత మిగిలింది..!

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

● రోజువారీ మొబైల్‌, టీవీ సమయాన్ని నిర్దేశించాలి. ● ఇండోర్‌ ఆటలు, సృజనాత్మక కార్యక్రమాలకు ప్రోత్సహించాలి. ● ఎండ, వేడి గాలి సమయంలో పిల్లలు ఇంట్లోనే ఉండేలా చూడాలి. ● తగినంత పోషకాహారం, మంచినీళ్లు అందించాలి. ● పిల్లలతో సమయం గడిపి, వారి ఆలోచనలు అర్థం చేసుకోవాలి.

పిల్లల భద్రత, అభివృద్ధి తల్లిదండ్రుల చేతుల్లోనే ప్రవర్తనను తరచూ పరిశీలించాలి నైతిక విలువలు పెంచే కథలు చెప్పాలి..

నిర్మల్‌ఖిల్లా: వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. పిల్లలు పుస్తకాలు పక్కనపెట్టేశారు. ఆట పాటలతో ఎంజాయ్‌ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల అసలు బాధ్యత ఇప్పుడే మొదలైంది. వచ్చే 45 రోజులు పిల్లలను ఎండల దెబ్బ నుంచి రక్షించి, కాలక్షేపం, మంచి ప్రవర్తన, ఆరోగ్యం విషయాల్లో శ్రద్ధ చూపాలి. ఈ 45 రోజుల కాలంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.

ఎండలతో ప్రమాదాలు..

ఈసారి ఎండలు తీవ్రంగా ఉండటంతో పిల్లలను కంటికి రెప్పలా కాపాడాలి. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. దీంతో బయ

టకు వెళ్లకుండా పిల్లలు మొబైల్‌లు, టీవీలకు అతుక్కునే ప్రమాదం ఉంది. ఇది కంటి సమస్యలు, నిద్రలేమి, ఆగ్రహ స్వభావాన్ని తీసుకొస్తుంది. సరైన మార్గదర్శకత లేకపోతే అలవాట్లు దెబ్బతింటాయి.

సృజనాత్మక కార్యక్రమాలు..

పిల్లలను ఇండోర్‌ ఆటలు, పుస్తక పఠనం, కథలు, చిత్రలేఖనం, పజిల్స్‌ వైపు మళ్లించండి. కుటుంబ సభ్యులతో ఆటలు ఆడటం సామాజిక నైపుణ్యాలను పెంచుతుంది. మొబైల్‌, టీవీ వాడకాన్ని పరిమితం చేసి, మేధోపరమైన కార్యక్రమాలకు ప్రోత్సాహించండి.

ఆరోగ్య జాగ్రత్తలు..

మధ్యాహ్నం వేళల్లో పిల్లలను బయటకు పంపొద్దు. ఉదయం తొందరగా లేదా సాయంత్రం చల్లని సమయాల్లో మాత్రమే అనుమతించాలి. తగినంత నీరు, పండ్ల రసాలు, తేలికపాటి ఆహారం ఇవ్వాలి. హైడ్రేషన్‌పై శ్రద్ధ పెట్టండి. చదువు, ఆటలు, విశ్రాంతి సమయాలను సమతుల్యం చేసే షెడ్యూల్‌ రూపొందించాలి. ఇది క్రమశిక్షణను పెంచుతుంది.

బాధ్యతలు తెలిసేలా...

క్లే మోడలింగ్‌ (మట్టితో బొమ్మలు చేయడం), పెయింటింగ్‌, ఒరిగామి (కాగితపు కళలు) నేర్పించాలి. అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పురాణ గాధలు, నీతికథలు వినేలా ప్రోత్సహించాలి. ఇది వారి భాషా పరిజ్ఞానాన్ని, విలువలను పెంచుతుంది. మొక్కలకు నీళ్లు పోయడం, ఇంటిని సర్దడం వంటి పనుల్లో పిల్లలను భాగస్వామ్యం చేస్తే వారికి బాధ్యత తెలుస్తుంది.

తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Advertisement
 
Advertisement
Advertisement