పురాతన ఆలయాలను పునర్నిర్మిద్దాం | - | Sakshi
Sakshi News home page

పురాతన ఆలయాలను పునర్నిర్మిద్దాం

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

వేమనపల్లి: పురాతన ఆలయాలను పునర్నిర్మించి ఆలయ చరిత్రను కాపాడుకుందామని టీటీడీ దేవాలయాల పర్యవేక్షణ అధికారి రామనాథం అన్నారు. సోమవారం మండల కేంద్రానికి సమీపంలోని రాజారం గ్రామంలో కొలువై న దశావతార దేవస్థానం, కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఐదు వేల ఆలయాలు నిర్మించామని, రాజా రంలో కొలువుదీరిన దశావతార, కాల భైరవ స్వామి దేవతామూర్తుల వద్ద ఆలయ నిర్మాణా నికి కృషి చేస్తామని అన్నారు. ఆలయ పురాతన చరిత్రను సూచించే వివరాలు, ఫొటోలు అందజేయాలని తెలిపారు. సర్పంచులు మళ్లీశ్వరి, సాయికృష్ణ, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ సభ్యుడు సత్యనారాయణ, ధర్మాచార్యులు పరమేశ్వర్‌, జయప్రద, చంద్రశేఖర్‌, సభ్యులు అమోల్‌, మహేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement