బెల్లంపల్లి: బెల్లంపల్లికి చెందిన ఓ శతాధిక వృద్ధురాలి రెండు కళ్లను సోమవారం ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. పట్టణంలో ని హన్మాన్‌బస్తీకి చెందిన డోలి నర్సమ్మ(103) అనా రోగ్యంతో మృతిచెందింది. జనహిత సేవా సమితి బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఆడేపు సతీష్, సభ్యుడు డోలి సుకుమార్ మృతురాలి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంతో నేత్రదానానికి ముందుకొచ్చా రు. ఎల్‌వీ ప్రసాద్ ఐ బ్యాంక్ సిబ్బంది ప్రదీప్ ఆమె కళ్లను సేకరించి తీసుకెళ్లారు. మృతురాలి కొడుకులు డోలి దశరథ్, విజయ్‌కుమార్, కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు.


