రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఠా గూర్‌స్టేడియంలో అస్మిత ఖేలో ఇండియా అండర్–16 బాలికల ఫుట్‌బాల్ పోటీలు సోమవారం ఘ నంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ఫుట్‌బాల్ అసో సియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో ఎనిమిది జిల్లాల క్రీడాకారులు పాల్గొంటున్నారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఎండల దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు మైదానాల్లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఉదయం జరిగిన మ్యాచ్‌ల్లో తొలుత నిజామాబాద్, గజ్వేల్ జట్లు తలపడగా 7–0 గోల్స్‌తో నిజామాబాద్ విజయం సాధించింది. రెండో మ్యాచ్ ఆదిలాబాద్, సిద్దిపేట జట్ల మధ్య జరుగగా 13–0 గోల్స్‌తో ఆదిలాబాద్ జట్టు విజయం సాధించింది. మూడో మ్యాచ్ రంగారెడ్డి, హైదరాబాద్ జట్ల మధ్య జరుగగా 1–0 గోల్స్‌తో రంగారెడ్డి జట్టు గెలుపొందింది. మరో మ్యాచ్ కరీంనగర్, వనపర్తి జట్ల మధ్య జరుగగా 1–0 గోల్స్‌తో కరీంనగర్ జట్టు విజయం సాధించింది. ఇక సాయంత్రం జరిగిన మ్యాచ్‌ల్లో కరీంనగర్, గజ్వేల్ జట్లు తలపడగా 6–0 గోల్స్‌తో కరీంనగర్ గెలుపొందింది. ఆదిలాబాద్, మల్కాజిగిరి మధ్య జరిగిన మ్యాచ్‌లో 2–0 గోల్స్‌తో ఆదిలాబాద్ గెలిచింది. సిద్దిపేట, రంగారెడ్డి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 0–10 గోల్స్‌తో రంగారెడ్డి, వనపర్తి, నిజామాబాద్ మధ్య జరిగిన మ్యచ్‌లో 6–0 గోల్స్‌తో నిజామాబాద్ గెలుపొందాయి. పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన మార్చ్‌ఫాస్ట్ ఆకట్టుకుంది.
క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండాలి
– సీఐ రమేష్, మందమర్రి
క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండాలని గెలుపోటములను సమానంగా స్వీకరించాలని మందమర్రి సీఐ పర్స రమేష్ అన్నారు. క్రీడల్లో రాణించటం వల్ల మంచి భవిష్యత్ ఉంటుందని, ముఖ్యంగా క్రమశిక్షణ ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్ మిట్టపల్లి సరిత, సింగరేణి గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, పట్టణ ఎస్సై శ్రీధర్, ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫాల్గుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పల్లె రాజు, వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు ఈశ్వరాచారి, బెల్లం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


