అర్జీలు త్వరగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు త్వరగా పరిష్కరించాలి

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

ఉట్నూర్‌రూరల్‌: ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌లో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఐటీడీ ఏ ఏపీవో వసంత్‌రావ్‌ అన్నారు. మండలకేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవా రం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ యా ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఆ యన ఆర్టీలు స్వీకరించారు. వాటిని సంబంధి త అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరి ష్కరించేలాచొరవ చూపాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

పోడు భూములకు పట్టాలివ్వాలని ఆందోళన

ఉట్నూర్‌రూరల్‌: ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలని కోరుతూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో సోమవా రం ఆందోళన చేపట్టారు. ఐటీడీఏ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఏపీవో వసంత్‌రావ్‌కు సమస్యలతో కూ డిన వినతిపత్రం అందజేశారు. ఇందులో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేతావత్‌ రాందాస్‌, ప్రధాన కార్యదర్శి జి వెంకటాద్రి, ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు కుటికెల శంకర్‌, ఉపాధ్యక్షుడు ధర్మం, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, ఉపాధ్యక్షుడు నర్సయ్య, మహిళా సంఘం జి ల్లా అధ్యక్షురాలు సంధ్యారాణి, బాలసాని మల్లేశ్‌గౌడ్‌, నాగరావ్‌, భగవంతరావ్‌, రవి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement