ద్విచక్ర వాహనంపై నుంచి పడి మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనంపై నుంచి పడి మహిళ మృతి

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

బోథ్‌: సొనాల మండలంలోని గుట్టపక్కతండా గ్రామానికి చెందిన సైనాబాయి (35) ద్విచక్రవాహనంపై నుంచి పడి మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సైనాబాయి తన అల్లుడు మట్ట నందుసింగ్‌ బైక్‌పై ఉదయం 6.30 గంటల సమయంలో చేనుకు వెళుతోంది. గంపలు తీసుకుని బైక్‌పై వెళుతుండగా సొనాల సమీపంలో అవి కదలడంతో ఒక్కసారిగా ఆమె జారి కిందపడింది. తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికుల సాయంతో బోథ్‌లోని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతిచెందింది. కాగా మృతురాలికి భర్త సదాశివ్‌, కుమారుడు ఉన్నారు.

పనిముట్ల కొరత లేకుండా చూడాలి

శ్రీరాంపూర్‌: గనుల్లో పనిముట్లు, యంత్రాల స్పేర్స్‌ కొరత లేకుండా చూడాలని శ్రీరాంపూర్‌ జీఎం ఎం. శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏరియా పర్చేజ్‌ అధికారులతో సమీక్షించారు. గనుల్లో యంత్రాల ని ర్వహణకు అవసరమయ్యే పరికరాల కొరత లేకుండా చూడాలన్నారు. నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలంటే యంత్రాలు నిర్ధేశించిన పని గంట లు పని చేయాలని తెలిపారు. ఇందుకోసం యంత్రాల బ్రేక్‌ డౌన్‌ అయినప్పుడు జాప్యం జరుగకుండా విడిభాగాలు సమకూర్చాలని, కొనుగోలు టెండ ర్లు, పనులు వేగవంతంగా చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్‌ఓటు జీఎం యన్‌. సత్యనారాయణ, ఏరియా ఇంజనీర్‌ రమణారావు, ఏజెంట్లు రవికుమార్‌, శ్రీధర్‌, ఓసీపీ పీఓ వెంకటేశ్వ ర్లు, అధికారులు నాగరాజు, రామకృష్ణ, మోహన్‌, మల్లేశ్‌, రవీందర్‌, చంద్రలింగం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement