వైభవంగా వాసవీ మాత జయంతి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా వాసవీ మాత జయంతి ఉత్సవాలు

Apr 27 2026 7:54 AM | Updated on Apr 27 2026 7:54 AM

మంచిర్యాలఅర్బన్‌: పట్టణంలోని విశ్వనాథస్వామి ఆలయ ఆవరణలో ఆదివారం వాసవీ మాత జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ దంపతులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య, వాసవీ క్లబ్‌ సభ్యులు కలెక్టర్‌ దంపతులను ఘనంగా సన్మానించారు. 350 మంది మహిళలు అమ్మవారికి చీరె సారె సమర్పించారు. సాయంత్రం పట్టణ పురవీధుల గుండా అమ్మవారి శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సత్యనారాయణ, జ్యోతి, కోఆప్షన్‌ సభ్యురాలు పద్మ, వాసవి క్లబ్‌ జాతీయ అడ్మినిస్ట్రేటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌లు ముక్త శ్రీనివాస్‌, సిరిపుర రాజేశ్‌, కటుకం హరీష్‌, వాసవి క్లబ్‌ జిల్లా గవర్నర్‌ పుల్లూరి బాలమోహన్‌, క్యాబినెట్‌ సెక్రెటరీ కేశెట్టి వంశీకృష్ణ, కోశాధికారి వెంకటేశ్వర్లు, పీఆర్వో రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

విశ్వకర్మ మహాసభ రాష్ట్ర

అధ్యక్షుడిగా సంతోష్‌చారి

శ్రీరాంపూర్‌: అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సంతోష్‌ చారి నియామకమయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో జాతీయ అధ్యక్షుడు అశ్విన్‌ కుమార్‌ నియామకపత్రం అందజేశారు. తన నియామకానికి సహకరించిన జాతీయ కమిటీకి సంతోష్‌ చారి కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement