పది రోజులైంది | - | Sakshi
Sakshi News home page

పది రోజులైంది

Apr 27 2026 7:54 AM | Updated on Apr 27 2026 7:54 AM

వరి కోసి పది రోజులు అవుతుంది. కొనుగోలు కేంద్రంలో ఆరబోసినాం. మైచర్‌ కూడా తక్కువగానే వస్తుంది. కొనుగోలు కేంద్రం ఎప్పుడో ప్రారంభించారు కాని కాంటా పెట్టడం లేదు. గత నాలుగు రోజులుగా మబ్బులు, వర్షం పడుతుంది. భారీ వర్షం కురిస్తే పంట తడిసిపోతుందని భయంగా ఉంది. రాత్రనక పగలనక ధాన్యం వద్దనే ఉండాల్సి వస్తుంది. కాంటా పెట్టి మిల్లులకు తరలించాలి.

– గొల్ల శ్రీకాంత్‌, గ్రామం: ఇటిక్యాల,

మం: లక్సెట్టిపేట

కాంటా పెడ్తలేరు..

వడ్లు ఆరబోసుకొని వారం రోజులు అవుతుంది. కాంటా పెడతలేరు. మిల్లుకు ట్యాగింగ్‌ కాలేదని ఆపుతున్నారు. ఎప్పుడు అయితదో ఎప్పుడు వడ్లు పోతాయో తెల్వడం లేదు. రోజు కుప్ప జేసుడు, నేర్పుడు అవుతుంది.

– ముత్తే రాజం, గ్రామం: గుల్లకోట,

మం: లక్సెట్టిపేట

ఆరబోసుడు.. కుప్పజేసుడు

కల్లంలో ధాన్యం ఆరబోసుకుని వారం రోజులు అవుతుంది. గన్నీ సంచులు వచ్చి నాలుగు రోజులు అవుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా ఉదయం ఆరబోసుకునుడు, సాయంత్రం కుప్పజేసి కవర్లు కప్పుడు అవుతుంది. మాపటి పూట మబ్బులు ఈదురుగాలు చినుకులు వస్తున్నాయి. కవర్లు ఇయ్యలే కొనుక్కొని కప్పుకునుడు అయితంది. వెంటనే కాంటాబెట్టి మిల్లుకు

పంపితే మంచిగుండు.

– శ్రీనివాస్‌, గ్రామం: ఇటిక్యాల,

మం: లక్సెట్టిపేట

Advertisement
 
Advertisement
Advertisement