‘నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టండి’ | - | Sakshi
Sakshi News home page

‘నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టండి’

Apr 27 2026 7:54 AM | Updated on Apr 27 2026 7:54 AM

రామకృష్ణాపూర్‌: కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ను విమర్శించడం మాని చెన్నూర్‌ నియోజకవర్గ సమస్యలపై మంత్రి వివేక్‌ దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ అన్నారు. క్యాతనపల్లి ఎన్నికల నేపథ్యంలో నమోదైన కేసుల్లో భాగంగా బెయిల్‌ షరతుల మేరకు ఆదివారం రామకృష్ణాపూర్‌ పోలీస్‌స్టేషన్లో సంతకం చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మంత్రి స్థానిక సమస్యలు పక్కనబెట్టి ఎక్కువగా ఇతర జిల్లాల్లోనే తిరుగుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో ని రుద్యోగ యువతకు 45 వేల ఉద్యోగాలు, ఈ ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీ, మందమర్రి–ఆర్‌కేపీలో 100 ప డకల ఆసుపత్రి తెస్తామని చెప్పిన మంత్రి ఆ హా మీల అమలుకు ఎందుకు కృషి చేయడం లేదని ప్రశ్నించారు. జీవో 76 కింద సింగరేణి స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇవ్వాల్సిఉండగా దానిని పట్టించుకోవడం లేదన్నారు. కవిత కొత్త పార్టీ గురించి ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యంలో పార్టీలు వస్తూంటాయని కేఏ పాల్‌, షర్మిల, విజయశాంతి లాంటి వారు కూడా పార్టీలు పెట్టారని ఇప్పుడా ఆ పార్టీలు ఎక్కడపోయాయని ఎద్దేవాచేశారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గొడిసెల సంధ్యారాణి, బీఆర్‌ఎస్‌ నాయకులు మూల రాజిరెడ్డి, సుదర్శన్‌గౌడ్‌, మేడిపెల్లి సంపత్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement