‘లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం’ | - | Sakshi
Sakshi News home page

‘లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం’

Apr 27 2026 7:54 AM | Updated on Apr 27 2026 7:54 AM

మందమర్రిరూరల్‌: లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యూసఫ్‌ అన్నారు. ఆదివారం మందమర్రిలోని సీఈఆర్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ జనరల్‌ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పనిగంటలు 8 నుంచి 14 గంటలకు పెంచే ప్రయత్నాలు శ్రమ దోపిడీకి దారితీస్తాయన్నారు. మే డే స్ఫూర్తితో కార్మికులు ఐక్యంగా లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్‌ సింగరేణి విభాగం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ మెడికల్‌ బోర్డులు, సొంతింటి పథకం, ఇన్‌కంటాక్స్‌ మాఫీ, తదితర సమస్యలను యాజమాన్యం పరిష్కరించని పక్షంలో జూన్‌లో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు రాజ్‌కుమార్‌, సలెంద్ర సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement