‘కార్పొరేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి’ | - | Sakshi
Sakshi News home page

‘కార్పొరేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి’

Apr 27 2026 7:54 AM | Updated on Apr 27 2026 7:54 AM

మంచిర్యాలఅర్బన్‌: నిబంధనలు పాటించకుండా ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్‌ చేశారు. ఆదివారం మార్క్స్‌భవన్‌లో పీడీఎస్‌యూ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. తోకపేర్లతో విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తున్న కార్పొరేట్‌ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌, సికిందర్‌, కార్తీక్‌, సంజయ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement