ఆదిలాబాద్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, జె.సి ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ‘లార్జెస్ట్ కరాటే డిస్‌ప్లే’ గిన్నిస్ వరల్డ్ రికార్డు అటెంప్ట్‌లో జిల్లా చిన్నారులు భాగస్వాములయ్యారు. 30 నిమిషాల వ్యవధిలో 50 సార్లు ‘మొదటి కటా తైకీకి షోడాన్’ ప్రదర్శన నిర్వహించారు. దీంతో గతంలో ఉన్న రికార్డును బద్దలు కొడుతూ మొత్తం 1212 మందితో కలిసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. బాల కేంద్రం శిక్షకులు మిట్టు దత్తు, గాజుల జగన్నాథ ఋషిల నేతృత్వంలో శిక్షణ పొందిన మందోల్ల మహాశ్విని, పడాల ధన్విక, హర్షిణి ఠాకూర్, కోండ్రా అలేఖ్య, క్షీరసాగర జాహ్నవి, దువాస హర్షినీ, జాగృతి, లింగంపల్లి సాయి కార్తీక, రోహిత్, యం. అయాన్ష్, గడ్డం శ్రీనిధి, దీరేన్ సింగ్‌లు ఈ ప్రదర్శనలో పాల్గొని గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారని బాల కేంద్రం పర్యవేక్షకుడు మిట్టు రవి వెల్లడించారు.


