‘అపూర్వ’ సమ్మేళనం..! | - | Sakshi
Sakshi News home page

‘అపూర్వ’ సమ్మేళనం..!

Apr 27 2026 7:54 AM | Updated on Apr 27 2026 7:54 AM

పాత జ్ఞాపకాలతో..!

నిర్మల్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలోని బాగులవాడలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మండలంలోని కొండాపూర్‌లో గల ఓ ఫంక్షన్‌ హాల్లో 1993 –94 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన 120 మంది విద్యార్థులు, 14 మంది ఆచార్యులు ఒకచోట చేరి పాత జ్ఞాపకాలు, అనుభవాలను పంచుకున్నారు. ప్రధానాచార్యులు రావుల సూర్యనారాయణ, ఆచార్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాలఅర్బన్‌: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 2002 –2003 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన విద్యార్థుల సమ్మేళనం ఆదివారం మంచిర్యాలలో నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులు పాఠశాలలో గడిపిన రోజులు.. పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. పాఠాలు బోధించిన సత్యనారాయణ, జమునరాణి, రఫీయా సుల్తానా, ఆశ్లేష తదితర ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

నర్సాపూర్‌(జి): మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. 1992 –93 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు 33 ఏళ్ల తర్వాత ఒకచోట కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. గురువులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

గుర్తుకొస్తున్నాయి..!

Advertisement
 
Advertisement
Advertisement