లక్ష్మణచాంద: చేపల వల కాళ్లకు చుట్టుకోవడంతో నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని బాబాపూర్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్నేళ్లుగా రాజమండ్రికి చెందిన కొందరు జాలర్లు తెలంగాణకు వలస వచ్చి వేసవి కాలంలో చేపలు పడుతూ జీవనం సాగిస్తుంటారు. ఆదివారం మండలంలో గల బాబాపూర్ పెద్ద చెరువులో రాజమండ్రికి చెందిన జాలర్లు సుమారు 15 మంది బృందం చెరువులో చేపలు పట్టడానికి దిగారు. సాయంత్రం 3.30 గంటలకు నందిపల్లి గోవింద్(34) అనే జాలరి కాళ్లకు వల చుట్టుకొని ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి మేనమామ రమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణి తెలిపారు.
అనుమానాస్పదంగా
గుర్తు తెలియని వ్యక్తి మృతి
నిర్మల్‌టౌన్: పట్టణంలోని శాంతినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద అనుమానాస్పదంగా గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రెండో ఫ్లోర్‌పై నుంచి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రూరల్ సీఐ కృష్ణ అక్కడికి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడు చేతిపై జాలమ్మ అనే పచ్చబొట్టు ఉందని, ఎవరికై నా వివరాలు తెలిస్తే పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.
ఉరేసుకొని ఒకరి ఆత్మహత్య
కుంటాల: మండలంలోని లింబా(కె) గ్రా మానికి చెందిన సూర్యవంశీ పండిత్ ఆది వారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్‌గా పని చేస్తున్న సూర్యవంశీకి అప్పులు పెరిగిపోవడంతో తన ఇంట్లో నే ఇనుప కొక్కానికి నైలాన్ తా డుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య అంజనా బాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.


