తాంసి: వారం రోజుల్లో కూ తురు పెళ్లితో ఆ ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉండగా కు మార్తె పెళ్లి పత్రికలు పంచేందు కు వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన మండలంలోని గిరిగాం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గిరిగాం గ్రామానికి చెందిన అదే జ్ఞానేశ్వర్ కూతురు వివాహం ఇటీవల నిశ్చయమైంది. వచ్చే నెల 4వ తేదీన వివాహం ఉండగా పెళ్లి పత్రికలు బంధువులకు పంచేందుకు గ్రామానికి చెందిన అమృత్‌తో కలిసి ద్విచక్రవాహనంపై మహారాష్ట్రకు వెళ్లాడు. ఈక్రమంలో మహారాష్ట్రలోని బోరి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో జ్ఞానేశ్వర్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందాడు. అమృత్‌కు సైతం బలమైన గాయాలు కావడంతో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల్లో కుమార్తె పెళ్లి జరగాల్సి ఉండగా తండ్రి ప్రమాదంలో మృతి చెందడంతో గిరిగాం గ్రామంలో ఆదివారం విషాధచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


