మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్, కవ్వాల్ అభయారణ్యంలో తాళ్లపేట రేంజ్‌లో వన్యప్రాణుల అడవంతా తమదే అన్నట్లుగా స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. పగలు ఎండ తీవ్రతకు పొదల మాటున ఉంటున్న జంతువులు చీకటి పడగానే అడవంతా తమదే అన్నట్లుగా స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు అమర్చిన నిఘా కెమెరాలకు చిక్కుతున్నాయి. తాజాగా కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల్లో చిరుతపులి, ఎలుగుబంటి, దుప్పి, ముళ్లపందులు తమ సహజ సిద్ధమైన ప్రవర్తనతో కదలుతూ కనిపించాయి. తాళ్లపేట రేంజ్ అధికారి సుష్మారావు మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ నిఘా కెమెరాలు వన్యప్రాణుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా జంతువుల ప్రవర్తనా తీరును అర్థం చేసుకోవడంతోపాటు, అడవిలో వన్యప్రాణుల జనాభాను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.
– జన్నారం
వనమంతా మాదే


