ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో 2020–26 బ్యాచ్ వైద్య విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రమేశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, అదనపు కలెక్టర్ చిత్రులో కలిసి వైద్య విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. అంతకుముందు మెడికోలు గుస్సాడీ నృత్యాలతో అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైద్య విద్యను అభ్యసించి పట్టా పొందడం అభినందనీయమని ప్రశంసించారు. ఉస్మానియా, గాంధీ వంటి ప్రముఖ వైద్య కళాశాలలకు దీటుగా రిమ్స్‌లో నాణ్యమైన విద్యాబోధన అందుతుందన్నారు. డాక్టర్ పూర్తిచేసుకున్న మెడికోలు పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. నిరంతర విద్యార్థిలా భవిష్యత్‌లో ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా సేవలు అందించాలని సూచించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులందరూ పీజీ సీట్లు సాధించాలన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కేరింతలు, చప్పట్లతో ప్రాంగణం మార్మోగింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలతో ఫొటోలూ దిగుతూ సందడి చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వంజారి, వైస్ ప్రిన్సిపల్ సరోజ, విద్యావిల్సన్, మెడికల్ డిప్యూటీ సూపరింటెండెంట్లు నరేందర్ బండారి, దీపక్ పుష్కర్ తదితరులు పాల్గొన్నారు.
● రిమ్స్‌లో ఘనంగా ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ డే ● ముఖ్య అతిథిగా హాజరైన కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ రమేశ్‌రెడ్డి
Apr 27 2026 7:54 AM | Updated on Apr 27 2026 7:54 AM
● రిమ్స్‌లో ఘనంగా ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ డే ● ముఖ్య అతిథిగా హాజరైన కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ రమేశ్‌రెడ్డి
Advertisement


