లక్సెట్టిపేట: బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. బాల్య వివాహాలు జరిపిస్తే అందులో పాల్గొన్న ప్రతీ ఒక్కరిపై కేసు నమోదవుతుందన్నారు. బాల్య వివాహా లు చట్ట పరంగా నేరమని, వాటిని ప్రోత్రహించవద్దన్నారు. చట్ట పరంగా అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 సంవత్సరాలు వచ్చినప్పుడే వివాహానికి అర్హులవుతారన్నారు. అనంతరం బాల్య వివాహాల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవిందరావు, మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి, వైస్ చైర్‌పర్సన్ రాజేశ్వరి, కమిషనర్ విజయ్‌కుమార్, న్యాయవాదులు, వార్డు కౌన్సిలర్‌లు పాల్గొన్నారు.


