సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పాలకవర్గాలను నా మినేటెడ్ పద్ధతిలో ప్రభుత్వం నియమించనుంది. చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల నియామకం జరుగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అధికార పార్టీ నాయకుల్లో పదవులపై ఆశలు రేకెత్తుతున్నాయి. గతంలో ప్రతీ సహకార సంఘానికి 13మంది చొప్పున డైరెక్టర్ల స్థానా లకు ఎన్నికలు జరిగేవి. సంఘ సభ్యులు ఓట్లు వేసి ఎన్నుకునేవారు. అలా ఎన్నికై న డైరెక్టర్లలో ఒకరిని చైర్మన్, మరొకరిని వైస్‌చైర్మన్‌గా ఎన్నుకునేవారు. తాజాగా ప్రభుత్వం ఎన్నికలు లేకుండా నేరుగా నా మినేటెడ్ పద్ధతిలో సంఘాల పాలకవర్గాలను పూర్తి చేయనుంది. దీనిపై ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆశావహులు పదవుల కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఏడాది దాటింది. గత ఫిబ్రవరిలో పదవీకాలం ముగియగా ప్రభుత్వం రెండుసార్లు పొడిగించింది. తర్వాత పలుచోట్ల సంఘాల చైర్మన్, వైస్‌చైర్మన్లపై ఆరోపణల కారణంగా పక్కన పెట్టింది. చివరికి గత డిసెంబర్ నుంచి పర్సన్ ఇన్‌చార్జీ లుగా సంఘాలకు అధికారులే ఉన్నారు. నూతన పాలకవర్గాలు రాక సంఘాల నిర్వహణలో జాప్యం జరుగుతోంది.
ముగ్గురా? ఐదుగురా?
నామినేటెడ్ పద్ధతిలో ఒక్కో సంఘానికి ఎంతమందిని ఎంపిక చేస్తారనేది ఇంకా స్పష్టత లేదు. ఒక్కో సంఘానికి ముగ్గురిని ఎంపిక చేసి, వారిలో చైర్మన్, వైస్ చైర్మన్, ఓ డైరెక్టర్, లేక ఐదుగురిలో ముగ్గురు డైరెక్టర్లు, చైర్మన్, వైస్ చైర్మన్‌గా ఉంటారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. అధికారులకు దీనిపై ఇంకా విధి విధానాలు రావాల్సి ఉంది. ఏపీలో కొత్తగా మార్పులు చేసిన చట్టం ప్రకారం ముగ్గురిని ఎంపిక చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో నామినేటెడ్ సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. నామినేటెడ్ చేసే సభ్యుల్లో జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు మహిళా వర్గాల కు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది.
జిల్లాలో 20సంఘాలు
జిల్లాలో 20ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాలు ఉండగా 23వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీటితోపాటు కొత్తగా ఏర్పడిన మండలాల్లో హాజీపూర్, నస్పూర్, కన్నెపల్లిలో మూడు కొత్తగా ఏర్పాటు చేసేందుకు జిల్లా సహకార శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇవి ఏర్పడితే సంఘాల సంఖ్య 23 కు చేరనుంది. ఇంకా ఉమ్మడి జిల్లా పరిధి కేంద్రంగా సహకారశాఖ కొనసాగుతోంది. కొత్త జిల్లాల వారీ గా ఏర్పాటు కాలేదు. దీంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా మార్కెటింగ్ సహకార సంఘం(డీసీఎంఎస్) సైతం కొత్త జిల్లాల వారీగా ఏర్పాటు చే యాల్సి ఉన్నా, ఆ దిశగా ముందడుగు పడడం లే దు. కొత్తగా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చై ర్మన్లు, డైరెక్టర్లను సైతం ఎంపిక చే యాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పాత సంఘాలకే నామినెటేడ్ పద్ధతిలో ఎంపిక జరగనుంది.
గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పరపతి కల్పనలో ప్రాథమిక సహకార సంఘాలు కీలకంగా పని చేస్తున్నాయి. పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ యంత్రాల సబ్సిడీలు, సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలకు ఆర్థికంగా తోడ్పాటు అందించడంలో ఉపయోగపడుతున్నాయి. రైతు వర్గాల్లో కీలకంగా ఉన్న ఈ పదవులు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు సూచించిన వారికే దక్కే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ కమిటీ పాలకవర్గాల తరహాలో సహకార సంఘాల్లోనూ ఇదే తీరుగా సాగనుంది. దీంతో అధికార పార్టీ రైతు నాయకులు ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. గత రెండున్నర ఏళ్లుగా అనేక మంది నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికార పార్టీ నాయకులకు అవకాశాలు దక్కనున్నాయి.
ఎంపిక
ఎమ్మెల్యేలదే..


