● పూర్తయిన ఓటర్‌ మ్యాపింగ్‌ ● పెరిగిన ఓటర్లతో 3,79,375 మంది ● జిల్లాలో 16 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలు | - | Sakshi
Sakshi News home page

● పూర్తయిన ఓటర్‌ మ్యాపింగ్‌ ● పెరిగిన ఓటర్లతో 3,79,375 మంది ● జిల్లాలో 16 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలు

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

● పూర్తయిన ఓటర్‌ మ్యాపింగ్‌ ● పెరిగిన ఓటర్లతో 3,79,375 మంది ● జిల్లాలో 16 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలు

‘పరిషత్‌’ ఎన్నికలకు కసరత్తు

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాయి. ఇక పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జిల్లా ప్రజాపరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ), మండల ప్రజాపరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) ఎన్నికలు మే నెలలో నిర్వహించేలా సిద్ధంగా ఉండాలని, ఇందుకు ఏర్పాట్లతో పాటు అదనంగా నమోదైన ఓటర్ల ప్రకారం వార్డులు, పోలింగ్‌ కేంద్రాల వారీగా మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఓటరు మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తికాగా 2,699 మంది ఓటర్లు పెరిగారు. మరోవైపు ఇప్పటికే జెడ్పీ చైర్మన్‌, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల రిజర్వేషన్‌ల ప్రక్రియ పూర్తి చేసి ఉంచారు. ఓటర్లు పెరగడంతో రిజర్వేషన్‌లు కూడా మారవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ఇక పరిషత్‌ల పాలకవర్గాల గడువు ముగిసి రెండేళ్లు దాటినా అడుగు ముందుకు పడటం లేదు.

పెరిగిన ఓటర్లు 2,699 మంది..

జిల్లాలో 16 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గత ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 3,76,676 మంది ఓటర్లు ఉన్నారు. పెరిగిన 2,699 ఓటర్లతో మొత్తం 3,79,375 మంది ఓటర్లు ఉన్నా రు. ఇందులో పురుషులు 1,86,949మంది, మహిళలు 1,92,411మంది, ఇతరులు 15 మంది ఉండగా పరిషత్‌ ఎన్నికల్లో మొత్తం 3,79,375మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

చిగురించిన ఆశలు..

పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే పరిషత్‌ ఎన్నికలు ఉంటాయని అందరూ భావి ంచినా బీసీ రిజర్వేషన్‌ల అంశం కోర్టులో తేలాకే ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. 42 శాతం బీసీ రిజర్వేషన్‌ల ప్రకారం మరోసారి రిజర్వేషన్‌లు మా రే అవకాశం ఉంది. తాజాగా ఎస్‌ఈసీ ఓటర్ల జాబి తాకు ఆదేశించడంతో ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే పల్లెల్లో పరిషత్‌ వేడెక్కడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్ము రం చేస్తున్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో బుజ్జగింపులు, రాజీపడి పోటీ చేయని వారితో పాటు కొత్తవారూ ఉన్నారు. అవసరమైతే ఎంపీపీ పదవి దక్కించుకోవాలని కొందరు, జెడ్పీటీసీగా గెలుపొంది కేబి నెట్‌ హోదా ఉన్న జెడ్పీ చైర్మన్‌ పదవి పొందాలని మరికొందరు చూస్తున్నారు. అయితే ఈ ఎన్నికలు ఇప్పుడు ఉంటాయా.? లేదా మరోసారి రిజర్వేషన్‌లు ప్రకటించాకే ఉంటాయా? అనే దానిపై అధికారికంగా స్పష్టత లేదు. కానీ ఎస్‌ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు మాత్రం అధికారులు సిద్ధంగా ఉన్నారు.

జిల్లా వివరాలు

జెడ్పీటీసీ స్థానాలకు

రిటర్నింగ్‌ అధికారులు 25

ఎంపీటీసీ స్థానాలకు

రిటర్నింగ్‌ అధికారులు 56

ఎంపీటీసీ స్థానాలకు

సహాయక రిటర్నింగ్‌ అధికారులు 56

మొత్తం పోలింగ్‌ అధికారులు 3,957

తేలిన ఓటర్ల లెక్క

మండలం ఎంపీటీసీ పోలింగ్‌ పురుష ఓటర్లు మహిళా ఓటర్లు ఇతరులు మొత్తం

స్థానాలు స్టేషన్‌లు

బెల్లంపల్లి 08 41 11,715 11,937 01 23,653

భీమిని 05 24 5,878 5,738 01 11,617

కన్నెపల్లి 05 30 7,645 7,905 01 15,551

కాసిపేట 09 52 13,194 13,448 03 26,645

కోటపల్లి 09 53 13,437 13,853 02 27,292

మందమర్రి 05 21 5,748 5,863 01 11,612

నెన్నెల 07 35 9,688 9,811 01 19,500

తాండూర్‌ 09 53 13,848 14,164 00 28,012

వేమనపల్లి 05 32 7,608 7,608 01 15,297

భీమారం 05 26 6,432 6,741 00 13,173

చెన్నూర్‌ 09 53 13,116 13,529 00 26,645

దండేపల్లి 14 78 20,618 21,771 01 42,390

హాజీపూర్‌ 06 31 8,414 8,655 00 17,069

జైపూర్‌ 10 52 15,374 15,464 01 30,839

జన్నారం 15 85 21,814 22,868 02 44,684

లక్సెట్టిపేట 08 47 12,340 13,056 00 25,396

మొత్తం 129 713 1,86,949 1,92,411 15 3,79,375

సిద్ధంగా ఉన్నాం..

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణలో ముఖ్యమైన ఓటరు జాబితా మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేశాం. గతంలోనే ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎన్నికల సంఘం ఎప్పుడు ఆదేశాలు ఇచ్చినా ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం.

– గణపతి, జెడ్పీ సీఈవో, మంచిర్యాల

Advertisement
 
Advertisement
Advertisement