భవనాలు చూసి ఆశ్చర్యపోయాం | - | Sakshi
Sakshi News home page

భవనాలు చూసి ఆశ్చర్యపోయాం

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

మేము మా పనులు తప్పితే ఊరు దాటి వెళ్లింది లేదు. మొదటిసారి హైదరాబాద్‌ వెళ్లొచ్చినం. ఉట్నూర్‌లో రెండంతస్తుల భవనాలు మించి కనబడవు. అక్కడ మాత్రం 50 అంతస్తుల భవనాలను బస్సులో వెళ్తూ చూశాం. నగరం ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాం.

– సోయం భీంరావు

మంచి విడిది, భోజనాలు

ఈ పర్యటనలో మాకు చారిత్రక కట్టడమైన తా రాబందీ బారాదరీలో వసతి కల్పించారు. మంచి వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. మంత్రి జూపల్లి మాతో కలిసి భోజనం చేశారు. అ లాగే ఎమ్మెల్యే బొజ్జు కుటుంబ సభ్యులతో కలి సి మాలో ఒకడిగా వచ్చారు. – మేస్రం జాగు

ఆదివాసీలకు అద్భుత అవకాశం

ఆదివాసీలకు ఇదో అద్భుత అవకాశం. ప్రస్తుతం విడతల వారీగా ఆదిలాబాద్‌ జిల్లా నుంచి గిరిపుత్రులను హైదరాబాద్‌ నగర సందర్శనకు తీసుకెళ్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఖమ్మంలోని పీవీటీజీలు బాహ్య సమాజానికి దూరంగా జీవితాలను వెల్ల దీస్తున్నారు. అలాంటి వారిలో నగర సందర్శన కొత్త అనుభూతినిస్తుంది. వారి కుటుంబాలు సైతం అభివృద్ధి బాట పట్టే అవకాశం ఉంటుంది.

– వెడ్మ బొజ్జుపటేల్‌, ఎమ్మెల్యే, ఖానాపూర్‌

Advertisement
 
Advertisement
Advertisement