బెల్లంపల్లి: సింగరేణి కార్మికులకు వైద్యసేవలు మెరుగుపరుస్తామని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్టు, ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు అన్నారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో రూ.80లక్షల అంచనాతో పునఃనిర్మాణం చేసిన పలు వైద్యవిభాగాలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏరియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. ఈసారి బెల్లంపల్లి, సత్తుపల్లి ఏరియాల్లో తప్పా ఇతర ఏరియాల్లో ఆశాజనకంగా బొగ్గు ఉత్పత్తి జరగలేదన్నారు. బెల్లంపల్లి ఏరియాలో కాస్తా ఆలస్యమైనప్పటికినీ గోలేటి, మహావీర్ ఖని (ఎంవీకే) ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనులు ఏర్పాటవుతాయన్నారు. జీఎం విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఏరియా ఆసుపత్రి డీవైసీఎంఓ పాండురంగాచారి, సింగరేణి కాలరీస్‌వర్కర్స్ యూని యన్ (ఏఐటీయూసీ) బెల్లంపల్లి, గోలేటి బ్రాంచి ఇన్‌చార్జి చిప్ప నర్సయ్య, బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్, ఏరియా ఆసుపత్రి పిట్ సెక్రెటరీ శ్రీధర్, టీబీజీకేఎస్ పిట్ సెక్రెటరీ సత్యనారాయణ పాల్గొన్నారు.


