వడదెబ్బతో ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఇద్దరు మృతి

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

ఆదిలాబాద్‌టౌన్‌/తాండూర్‌: ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాలో వడదెబ్బకు గురై ఇద్దరు మృతిచెందారు. ఆదిలాబాద్‌లోని తాటిగూడకు చెందిన గొడ్కే రాంగోపాల్‌ (65) శనివారం పట్టణంలోని పంజాబ్‌చౌక్‌లోని ఓ హోటల్‌ ఎదుట పడి మృతిచెందినట్లు వన్‌టౌన్‌ సీఐ సునీల్‌ కుమార్‌ తెలిపారు. తాండూర్‌ మండలం రేచిని పంచాయతీ బారేపల్లికి చెందిన కొట్రంగి జయరాం (40) ట్రాక్టర్‌ డ్రైవర్‌ శుక్రవారం పనినిమిత్తం బెల్లంపల్లికి వెళ్లి ఎండదెబ్బకు గురై అస్వస్థతకు గురయ్యాడు. రాత్రి అతన్ని కుటుంబీకులు బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు మంచిర్యాలకు తీసుకెళ్లాలని సూచించారు. మార్గమధ్యలోనే మృతి చెందాడు. భార్య నీలాబాయి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తాండూర్‌ ఎస్సై ప్రసాద్‌రావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement