గుర్తుతెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి మృతి

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

గుర్తుతెలియని వ్యక్తి మృతి మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడికి 45 ఏళ్ల వయస్సు ఉంటుందని, బూడిద రంగు చొక్కా, బ్లూరంగు జీన్స్‌ ప్యాంట్‌ రంగు ధరించి ఉన్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదిలో మృతదేహం భద్రపర్చామని, ఇతడి వివరాలు తెలిస్తే సెల్‌ 8712656534 నంబర్‌లో సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు.

చెరువులో పడి

యువకుడు..

ఆదిలాబాద్‌రూరల్‌: చెరువులో పడి యువకుడు మృతిచెందినట్లు ఎస్సై విష్ణువర్ధన్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు..మండలంలోని జందాపూర్‌ గ్రామానికి చెందిన సొప్పరి సాయికుమార్‌ (31) కుటుంబ సభ్యులతో కలిసి ఎడ్లబండిపై శనివారం వ్యవసాయ పొలానికి వెళ్లాడు. కుటుంబ సభ్యులను చెరువు ఒడ్డున దించారు. ఎడ్లకు చెరువులో నీళ్లు తాగించే క్రమంలో లోతు నీళ్లలోకి తీసుకెళ్లాయి. ఎడ్లబండిపై ఉన్న సాయికుమార్‌ ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఆయన అరుపులు విన్న సమీపంలోని ఉపాధి కూలీలు అతన్ని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం 108లో రిమ్స్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ..

ఆదిలాబాద్‌టౌన్‌: పట్టణంలో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో శుక్రవారం రాత్రి మృతిచెందింది. పట్టణంలోని భుక్తాపూర్‌లోని హలి ్దరాం షాప్‌ ముందు గల డ్రెయినేజీలో ఇచ్చోడకు చెందిన జంగల్వార్‌ అనిత (45) మృతిచెంది ఉంది. శనివారం స్థానికులు గమనించి వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సునీల్‌ కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement