లింగాపూర్: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని కంచన్‌పల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై గంగన్న కథనం ప్రకారం.. కంచన్‌పల్లికి చెందిన పేందుర్ గిరిజాబాయి (36), పేందుర్ బంధు దంపతులు. సిర్పూర్(యూ) మండలం నేట్నూర్ గ్రామానికి చెందిన ఆత్రం లచ్చు గత కొంతకాలంగా గిరిజాబాయిను వేధిస్తున్నాడు. ఆమెను వెంబడించడం, ఫోన్‌లో వేధింపులకు గురిచేయడం, నీ జీవితం నాశనం చేస్తానని బెదిరిస్తుండేవాడు. గురువారం రాత్రి గిరిజాబాయి బయటకు వెళ్లిన సమయంలో ఆత్రం లచ్చు వెంబడించగా ఆమె ఆరుస్తూ ఇంటికి చేరుకుని బాబాయి కనకజ్యోతిరామ్‌కు విషయం చెప్పింది. సమీప బంధువు కోట్నాకపావుతో కలిసి అక్కడికి వెళ్లగా లచ్చు పారిపోయాడు. నిరంతరం వేధింపులతో మనస్తాపం చెందిన గిరిజాబాయి శుక్రవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగింది. అంబులెన్స్‌లో ఆమెను జైనూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. మృతురాలి తండ్రి బాపురావు, సోదరి జ్ఞానేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పిచ్చికుక్క దాడిలో ఆవులకు గాయాలు
జన్నారం: వుండలంలోని కవ్వాల్ గ్రామంలో శనివారం పిచ్చికుక్క దాడిలో మూడు ఆవులకు గాయాలయ్యాయి. దుర్గం రాజన్న, దొంగరి లింగన్న, తుడుం దేవయ్యలకు మూడు ఆవులు, దూడలపై కుక్క దాడి చేసి గాయపర్చాయి. పిచ్చికుక్క స్వైరవిహారంతో గ్రామస్తులు భయందోళనకు గురవుతున్నారు. కుక్క ల బెడద నివారించాలని కోరుతున్నారు.


