భారీ పెట్టుబడి మోసం కేసులో నిందితురాలు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

భారీ పెట్టుబడి మోసం కేసులో నిందితురాలు అరెస్ట్‌

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: కాగజ్‌నగర్‌ టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన రూ.2 కోట్ల భారీ పెట్టుబడి మో సం చేసిన కేసులో నిందితురాలు థాకూర్‌ శివరంజనిబాయిని అరెస్టు చేసినట్లు ఎస్పీ నితిక పంత్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శనివారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. డివైన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ పేరిట నకిలీ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలను పెట్టుబడి పెట్టమని, అధిక లాభాలు వస్తాయని నమ్మించి సుమారు రూ. 2 కోట్ల మొత్తంలో నగదు వసూళ్లు చేశారు. 5 నుంచి 20 శాతం లాభాలు ఇస్తామని చెప్పి మోసాలకు పా ల్పడ్డారు. కాగజ్‌నగర్‌, పెంచికల్‌పేట్‌, హైదరాబాద్‌ ప్రాంతాల్లో 2021 నుంచి 2023 మధ్య కాగజ్‌నగర్‌లో ఉంఉడి ప్రజల నుంచి డబ్బులు తీసుకుని పరారయ్యారు. కేసులో మొత్తం ఐదుగురు నిందితులు ఉండగా ఇందులో థాకూర్‌ శివరంజనిబాయిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. మిగతా నిందితులు ఠాకూర్‌ కరణ్‌సింగ్‌, థాకూర్‌ రతన్‌సింగ్‌, ధా కూర్‌ రవీందర్‌, థాకూర్‌ రాణాసింగ్‌ పరారీలో ఉ న్నారని వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కీలక నిందితురాలిని అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహిదుద్దీన్‌, టౌన్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌, ఎస్సై రాజు, కానిస్టేబుళ్లు లక్ష్మి, జ్యోత్స్న, బ్లేస్సీ, షమీనా, కానిస్టేబుల్‌ విజయను ఎస్పీ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement