అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డులు | - | Sakshi
Sakshi News home page

అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డులు

Apr 25 2026 7:48 AM | Updated on Apr 25 2026 7:48 AM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో అర్హులైన జర్నలిస్ట్‌లందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు అందిస్తామని జిల్లా కలెక్టర్‌, జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ చైర్మన్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా పౌర సంబంధాల అధికారి, జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ కన్వీనర్‌ మాదంశెట్టి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. 2026–28 సంవత్సరాలకు గాను ప్రభుత్వ ఉత్తర్వులు 252, ఆర్‌టీ 103 ప్రకారం అర్హులైన వర్కింగ్‌ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేయాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో అందిన దరఖాస్తులను కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు రమేష్‌రెడ్డి, సిద్ధార్థ, సురేష్‌ కుమార్‌, సత్యనారాయణ, ఇమాద్‌ ఉద్దీన్‌, ప్రకాష్‌రెడ్డి, నవీన్‌కుమార్‌, నరేష్‌, సదానందం, సంతోష్‌, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయ సిబ్బంది సంపత్‌కుమార్‌, జి.రవితేజ, సునీల్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement