కార్మికుల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

కార్మికుల సంక్షేమానికి కృషి

Apr 25 2026 7:48 AM | Updated on Apr 25 2026 7:48 AM

● సింగరేణి డైరెక్టర్‌(పీపీ) వెంకటేశ్వర్లు

కాసిపేట/శ్రీరాంపూర్‌: సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తోందని సింగరేణి డైరెక్టర్‌(ప్లానింగ్‌ అండ్‌ ప్రాజెక్టు) కే.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన మందమర్రి ఏరియా కాసిపేట–1ఏ న్యూటన్నల్‌ గనిపై మ్యాన్‌ రైడింగ్‌ను ప్రారంభించారు. కేకే ఓసీ వ్యూ పాయింట్‌ నుంచి బొగ్గు వెలికితీత పనులను పర్యవేక్షించారు. శ్రీరాంపూర్‌ ఓపెన్‌ కాస్ట్‌ గనిని సందర్శించి బొగ్గు ఉత్పత్తి వివరాలు తెలుసుకున్నారు. జీఎం కార్యాలయంలో ఏరియా ముఖ్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భూగర్భ గనుల ద్వారా నష్టం వాటిల్లుతున్నా కార్మికుల సంక్షేమం కోసం నడిపిస్తున్నామని తెలిపారు. అత్యధికంగా నష్టం వాటిల్లే గనుల్లో మొదటి స్థానంలో కాసిపేట గని ఉందన్నారు. నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ముందుస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. మందమర్రి ఏరియా కేకే ఓసీలో గని వ్యూ పాయింట్‌ను సందర్శించి బొగ్గు వెలికితీత పనులను పర్యవేక్షించారు. మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ, శ్రీరాంపూర్‌ జీఎం ఎం శ్రీనివాస్‌, శ్రీరాంపూర్‌ ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్లు, ఏజెంట్‌ రాంబాబు, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్‌, ఏరియా కార్యదర్శి సత్యనారాయణ, గని మేనేజర్‌ సతీష్‌కుమార్‌, సంక్షేమాధికారి జీషాన్‌, కేకే ఓసీ ఎస్‌ఓటూ జీఎం ప్రసాద్‌, బెల్లంపల్లి రీజియన్‌ జీఎం క్వాలిటీ వీరభద్రరావు, కేకే ఓసీ మేనేజర్‌ రామారాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement