వేదం.. జీవన నాదం | - | Sakshi
Sakshi News home page

వేదం.. జీవన నాదం

Apr 25 2026 7:48 AM | Updated on Apr 25 2026 7:48 AM

● ఆధ్యాత్మిక పరిమళాలను అందిస్తోన్న బాసరలోని వేద విద్యాలయం ● ఆన్‌లైన్‌లోనూ తరగతుల నిర్వహణ ● ఇప్పటివరకు 300 మందికి శిక్షణ

బాసర: బాసరలోని శ్రీవేద భారతి పీఠం ఎంతో మందికి వేదవిద్యను అందిస్తోంది. నిత్యం ఆధ్యాత్మి క కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ తదితర సుదూర ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడి వేద విద్యాలయాన్ని సందర్శిస్తున్నా రు. సనాతన ధర్మానికి మూలమైన వేద జ్ఞానాన్ని అందించే కల్పవల్లిగా బాసర వేదవిద్యాలయం వి రాజిల్లుతోంది. ఇక్కడ విద్యార్థులకు వేద తరగతులు నిర్వహిస్తూ ఉచితంగా ఆహారం, ఆశ్రయం అందిస్తోంది. వేద విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న శ్రీవేదభారతి పీఠం వ్యవస్థాపకుడు వేద విద్యానందస్వామీజీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఉచిత వసతి, భోజన సౌకర్యం

బాసరలో వేదభారతి పీఠాన్ని 2008లో స్థాపించా రు. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం

కల్పిస్తూ వేదవిద్యతో పాటు ఆధునిక విద్య (ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, సైన్స్‌)ను బోధిస్తున్నారు. కులాలకు అతీతంగా లింగబేధం లేకుండా వేద విజ్ఞానాన్ని అందించే ప్రక్రియ నిరాటంకంగా సాగుతోంది. 12 ఏళ్లు పైబడిన బాలబాలికలకు వేదవిద్యను అందించే ప్రణాళికనూ రూపొందించారు. వేదవిద్య ప్రవేశపెట్టి పదోతరగతి/ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్లతో కూడిన కోర్సులు అందుబాటులో ఉంచారు. SVBPయూట్యూబ్‌ చానెల్‌ ద్వారా వేలాదిమందికి ఆన్‌లైన్‌లో ఉచితంగా వేదవిద్యను అందిస్తున్నారు. ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ వేదవిద్యను అందిస్తున్న ఏకైక సంస్థగా బాసర శ్రీవేదభారతి పీఠం భక్తులకు చేరువవుతోంది. ఇప్పటివరకు వేదవిద్యలో సుమారు 300మందికి శిక్షణ ఇచ్చిన ఘనత వేద విద్యానందస్వామీజీకి దక్కింది.

నిర్వహించే కార్యక్రమాలు

వేద విద్యాలయం ఆధ్వర్యంలో హిందూ సంప్రదాయం, వేదవిద్యను పెంపొందించేలా ప్రణాళికలు రూపొందిస్తూనే నిరుపేదలకూ ఉచిత విద్యావకాశాలు కల్పిస్తున్నారు. విద్యార్థులు నిత్యం ఉదయం ప్రార్థన, సూర్యనమస్కారాలు, యోగా, వేద అధ్యయనం, వీణ, గిటా ర్‌, వయోలిన్‌ తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ శనివారం సాయంత్రం 5.30నుంచి 7.30గంటల వరకు రుద్రాభిషేకం, త్రినాథ వ్రతం, గోపూజ, గోహారతిని స్వామీజీ సహకారంతో రుషికన్యలు, రుషి పుత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేదవిద్యాలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తారు. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 26న అర్హులైన విద్యార్థులకు ఉపనయన కార్యక్రమం ని ర్వహిస్తున్నారు. కులాలకు అతీతంగా 18–25ఏళ్లవారికి వేదమంత్రాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, పూజా హోమాది క్రతువులు తదితర కార్యక్రమాలపై మూడేళ్ల కాల వ్యవధితో శిక్షణ ఇస్తున్నారు.

ఏడాది కిందటివరకు సుమారు తొమ్మిదేళ్లు గోదావరినది తీరంలో నిరంతరాయంగా ‘గోదావరికి నిత్యహారతి’ పేరిట నదీమ తల్లికి హారతులిచ్చి శ్రీవేద భారతి పీఠం పలువురు ప్రముఖుల మన్ననలు పొందింది. శ్రీవేద భారతి పీఠం వ్యవస్థాపకుడు శ్రీవేద విద్యానందస్వామీజీ నేతృత్వంలో గోపూజ, త్రినాథ వ్రతం, గోహారతులు ఇస్తూ వేదవిద్యతోపాటు గోసంపదకు విలువలనిచ్చే ఏకై క సంస్థగా వేదభారతి పీఠాన్ని భక్తులు కొనియాడుతున్నారు. ఆలయాలు క్షేత్రాల వద్ద ఇలాంటి ఆశ్రమాలు, మఠాలు మరిన్ని వృద్ధిలోకి వస్తే ఆలయ క్షేత్రాలు వైదికంగా మరింత అభివృద్ధి చెందుతాయని భక్తులు భావిస్తున్నారు.

తొమ్మిదేళ్లు నిత్య గోదావరి హారతి

Advertisement
 
Advertisement
Advertisement