రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

Apr 25 2026 7:48 AM | Updated on Apr 25 2026 7:48 AM

బాసర: మండలంలోని టాక్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ము థోల్‌ నుంచి కూలీలు ఆటోలో బాసరకు వెళ్తున్నారు. బాసర–భైంసా రహదారిపై టాక్లి సమీపంలో ఎదురుగా వస్తున్న జేసీబీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముథోల్‌కు చెందిన రుమోళ్ల పోతన్న (26) అక్కడికక్కడే మృతిచెందగా, మిగతా కూలీలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సాయన్న ఫిర్యాదు మేరకు బాసర సీఐ కిరణ్‌కుమార్‌, ఏఎస్సై గంగాధర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement