మందమర్రిలో చెస్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

మందమర్రిలో చెస్‌ పోటీలు

Apr 25 2026 7:48 AM | Updated on Apr 25 2026 7:48 AM

మందమర్రిరూరల్‌: మందమర్రి పట్టణంలోని బూరుదగూడెంలోగల లిటిల్‌ఫ్లవర్‌ హైస్కూల్‌లో శుక్రవారం అండర్‌–7, అండర్‌–11, ఓపెన్‌ టూ ఆల్‌ మంచిర్యాల, కుమురంభీం ఆసిఫా బాద్‌ జిల్లాల విద్యార్థులకు చెస్‌ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ నెల 26న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన వి ద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్వాహకుడు, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా చదరంగం చైర్మన్‌ ఈగ కనకయ్య, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ సంపత్‌కుమార్‌, కొంగల తిరుపతిరెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్‌, శృతి, కుమార్‌, కార్యవర్గ సభ్యుడు సతీశ్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement